AP | దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు..

AP | దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు..
భవానీలందరికీ అమ్మ వారి శీఘ్రదర్శనం..
అందుబాటులో అన్న ప్రసాదం లడ్డూలు..
దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఈఓ శీనా నాయక్
ఏర్పాట్లపై సమీక్షా క్షేత్రస్థాయి పరిశీలన..
AP | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : భవానీ దీక్షల విరమణ కోసం వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ (Chairman) బొర్రా గాంధీ, ఈఓ శీనా నాయక్ లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగబోయే భవానీ దీక్షల విరమణ-2025 ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం దేవస్థానం ఈవో కార్యాలయ మహామండపం 4వ అంతస్తులోని ఛాంబర్‌లో దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈఓ, చైర్మన్ (EO, Chairman) ఆధ్వర్యంలో సమావేశంలో ఈఈ లు కోటేశ్వర రావు, రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇతర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు బి.వెంకట రెడ్డి, ఎన్.చంద్రశేఖర్, పి.సుధారాణి, ఎన్.రమేష్ బాబు, ఎం.ఎస్.ఎల్. శ్రీనివాస్ (వాసు), కె.గంగాధర్, దేవస్థానం సూపరింటెండెంట్లు, ముఖ్య ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భవానీ భక్తులకు (Bhavani devotees) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా స్నాన ఘట్టాలు (బేతింగ్ ఘాట్స్) వద్ద ఏర్పాట్ల, భవానీల దర్శనం ఏర్పాట్లు, క్యూ లైన్లు. ఇరుముడి సమర్పణ పాయింట్లు, హోమ గుండాల ఏర్పాటు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, అన్న ప్రసాదం పంపిణీ, ప్రసాదం కౌంటర్లు, భక్తుల నిష్క్రమణ మార్గాలు (ఎగ్జిట్) వంటి ఏర్పాట్లపై సూచనలు సలహాలు అందజేశారు. సమావేశం అనంతరం, ఛైర్మన్, ఈవో నేతృత్వంలో అధికారులు కనకదుర్గ నగర్‌లోని పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
