కఠిన చర్యలు తీసుకుంటాం
గజ్వేల్, ఆంధ్రప్రభ : గజ్వేల్(Ghazwal) పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా, హాస్పిటల్ చౌరస్తా, జాలిగామ ఎక్స్ రోడ్ చౌరస్తా, తదితర ప్రాంతాలలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు, ఫుట్ పాత్ ఆక్రమించి రోడ్డుపై సామాను పెట్టి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని, ట్రాఫిక్ రోడ్డు నిబంధనల పై ఈ రోజు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మురళి(Inspector Murali) మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణం, ప్రజ్ఞాపూర్ రోడ్, తూప్రాన్ రోడ్, ఓల్డ్ గజ్వేల్ రోడ్డు, జాలిగామ ఎక్స్ రోడ్ తదితర ప్రాంతాలలో వ్యాపారస్తులు పుట్ బాత్ ల పై, రోడ్ పైకి వచ్చి సామాన్లు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టి వాహనదారులకు. నడుచుకుంటూ వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాపారస్తులకు కౌన్సిలింగ్(Counselling) చేయడం జరిగిందన్నారు.
వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. రోడ్లపై సామాను పెట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. రోడ్డుపై వెళ్లే ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలన్నారు. షాప్స్ యజమానులు(Shop Owners) రోడ్డుపైకి, ముందుకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, దీని వల్ల వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రోడ్డుకిరువైపులా దుకాణదారులు, బండ్లు పెట్టవద్దని సూచించారు. షాపు స్థలం వరకు మాత్రమే దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు(registration of cases) చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

