కష్టకాలంలో స్టాక్

  • అమెరికా వీసా పేచీ
  • ఎన్ బీ ఎఫ్ సీ తొడపాశం
  • ఇప్పటికే రూ. 10 లక్షల కోట్లు పాయె
  • ఇక ఆర్బీఐ వడ్డీ కరుణ
  • ట్రంప్ తో బేరం ..
  • వీటిపైనే మార్కెట్ ఆశ

ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : భారతీయ స్టాక్ మార్కెట్‌ లో మదుపర్లు పెద్ద కష్టాన్ని, భారీ నష్టాన్ని చవిచూశారు. సెన్సెక్స్ నిఫ్టీ(Sensex Nifty) ఈ రెండూ సుమారు 2.7% డౌన్ ఫాల్(down fall) అయ్యాయి, మార్కెట్‌లో నెగిటివ్ సెంటిమెంట్ పీడించింది. సెప్టెంబర్ 22 నుంచి, 23, 24, 25, 26 తేదీల్లో .. ఈ 56 రోజుల్లో నిరంతర ఫాల్ తప్పా గెయిన్ కనిపించలేదు.

సుమారు రూ.10 లక్షల కోట్లు నుంచి రూ.15 లక్షల కోట్ల వరకూ సంపద ఆవిరైనట్టు ఆర్థిక నిపుణులు లెక్క కట్టారు. సెన్సెక్స్ సుమారు 2,520 పాయింట్లు (3.04%) నష్టపోయి, సెప్ 19 క్లోజ్ (82,946) నుంచి సెప్ 26 క్లోజ్ (80,426) కి పడిపోయింది. నిఫ్టీ 50 సుమారు 3% నష్టపోయి 24,654.70 వద్ద ముగిసింది ఘముఖ్యంగా IT, ఫార్మా, మెటల్ సెక్టార్ల నుంచి FII అవుట్‌ఫ్లో(Outflow) వల్ల ఎక్కువ నష్టం వాటిల్లింది.

ఇక వచ్చే వారం షేర్ మార్కెట్ కోలుకోవాలంటే, US రేట్ కట్ అంచనాలు (అక్టోబర్‌లో 87% ప్రాబబిలిటీ), ఇండియా-US ట్రేడ్ డీల్ ఆశలు మెరుగు పడాలి. ఒకవేళ FII అవుట్‌ఫ్లోలు (₹1.44 లక్షల కోట్లు 2025లో), రూపాయి బలహీనత (₹88.75/$). మోడరేట్ రికవరీ (0.5-1% గ్రోత్) సాధ్యం కాలేదో.. మళ్లీ పతనం తప్పదు.

గత వారం ఏమి జరిగిందంటే..

సెప్టెంబర్ 22 (సోమవారం) సెన్సెక్స్ 466 పాయింట్లు (0.56%) తగ్గి 82,159.97 వద్ద ముగిసింది. 24,654.70కి పడిపోయింది. M&M (4% డౌన్), Eternal (3% డౌన్) స్టాకులకు పెద్ద దెబ్బ తగిలింది.
సెప్టెంబర్ 23న సెన్సెక్స్ 82,147 (డౌన్ 0.19%), నిఫ్టీ 25,142 (డౌన్ 0.24%), తగ్గిపోగా బీఎస్ఈBSE) 82,154.53 ( -0.01%) నిప్టీ 25,186.20 ( -0.06% ) మార్కెట్ మిడ్‌డే( Market Midday)లో స్వల్ప రికవరీ కాగ ముగింపులో డౌన్ ఫాల్ తప్పలేదు.


సెప్టెంబర్ 24న వరుసగా నాలుగోరోజూ మార్కెట్ పతనం తప్పలేదు. బీఎస్ఈ 81,715.00 ( -0.47% ) నిఫ్టీ 25,056.00 ( -0.52%) ఐటీ, ఆటో సెక్టార్లు(Auto Sectors) కింద పడ్డాయి, మధ్యాహ్నం సెన్సెక్స్ 81,807 (డౌన్ 0.36%), నిఫ్టీ 25,091 (డౌన్ 0.31%). కేవలం US వీసా ఇబ్బందులే దెబ్బతీశాయి.


సెప్టెంబర్ 25 (బుధవారం) సెన్సెక్స్ 556 పాయింట్లు తగ్తిపోగా, నిఫ్టీ 25,000 కంటే కిందకు పడిపోయింది.
సెప్టెంబర్ 26 (గురువారం)న సెన్సెక్స్ 733 పాయింట్లు(Points) (0.9%) తగ్గింది. 80,426.46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 236 పాయింట్లు (0.95%) కు జారిపోయి
గత వారం భారతీయ స్టాక్ మార్కెట్‌కు కష్టకాలం.

1 Shriram Finance షేర్ ధర(Share Price) రూ. 605.65 కాగ, పతనం -54.94%
2 Tech Mahindra షేర్ ధర రూ. 1,407.70లు పతనం -9.22%
3 Trent షేర్ ధర రూ.4,679.00లు కాగ పతనం -9.04%
4 TCS షేర్ ధర రూ. 2,899.10లు కాగ పతనం -8.74%
5 Wipro షేర్ ధర రూ. 235.75లు కాగ పతనం -8.24%


6 Jio Financial Services షేర్ ధర రూ. 295.85లు పతనం -6.77%
7 M&M షేర్ ధర రూ. 3,396.50 లు కాగ, పతనం -6.75%
8 HCL Technologies షేర్ ధర రూ. 1,395.30లు కాగ పతనం -6.59%
9 Infosys షేర్ ధర రూ. 1,448.90లు కాగ పతనం -5.95%
10 Asian Paints షేర్ ధర రూ. 2,342.80 లు కాగ పతనం -5.48%
IT సెక్టార్ లో TCS, Infosys, TechM, Wipro) గణనీయంగా పడిపోయింది, కేవలం US H-1B వీసా అనిశ్చితే ఇందుకు కారణం ,

గత వారం Shriram Finance షేర్ 54.94% నష్టపోయింది (₹1,200+ నుంచి ₹605.65కి), తాజా డేటా ప్రకారం ఒక వారం నష్టం 2-8% మధ్య (₹625 నుంచి ₹612.70కి). మార్కెట్-వైడ్‌గా NBFC వత్తిడి వల్లే ఈ నష్టం వాటిల్లింది.

  1. మార్జిన్ కంప్రెషన్, ఎక్సెస్ లిక్విడిటీ(Excess Liquidity), FY25 Q1లో NIM (నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్) 8.7-8.8% నుంచి తగ్గింది, ₹3,100 కోట్లు క్యాష్‌లో పార్క్ చేయడం వల్ల. ఇది రెవెన్యూ పై ప్రభావం చూపింది, ఇన్వెస్టర్లు(Investors) ఆత్మవిశ్వాసం కోల్పోయారు.
  2. క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ రైజింగ్ కాస్ట్స్, హెడ్‌లైన్ నంబర్లు మంచిగా ఉన్నప్పటికీ, ఎర్నింగ్స్ క్వాలిటీ(Earnings Quality) తక్కువ కావటంతో ఆపరేటింగ్ ఖర్చులు పెరిగాయి. ఇంట్రెస్ట్ ఎక్స్‌పెన్సెస్ 44.11% (FY25), ఎంప్లాయీ కాస్ట్(Employee Cost) 8.73% కు చేరింది.
  3. మ్యాక్రో హెడ్‌విండ్స్(Macro Headwinds) మార్కెట్ సెంటిమెంట్ USలో ఆర్థిక అనిశ్చితి, FII అవుట్‌ఫ్లో, NBFC సెక్టార్ ప్రెషర్ లో ఇంట్రెస్ట్ కవరేజీ రేషియో, ప్రమోటర్ హోల్డింగ్ -3.91% డౌన్ (25.4%) కు తగ్గింది.
  4. సెక్టార్-వైడ్ ట్రెండ్స్ : NBFCలలో 8%+ డౌన్, Shriram AUM గ్రోత్ 17% ఉన్నప్పటికీ, కాంపిటీషన్, PCR తగ్గుదల ప్రభావం ప్రభావం చూపింది.

గత వారం భారతీయ స్టాక్ మార్కెట్‌లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల స్టాక్స్ మిశ్రమ పనితీరును చూపించాయి. సెన్సెక్స్ , నిఫ్టీ 50 సుమారు 2.7-3% నష్టపోయిన నేపథ్యంలో, NBFC సెక్టార్ కూడా మార్కెట్ ప్రెషర్‌ను ఎదుర్కొంది, కానీ కొన్నికంపెనీలు స్థిరత్వం లేదా గణనీయమైన లాభాలను చూపించాయి.
Bajaj Finance షేర్ ధర రూ. 7,762.00లు కాగ -2.5% పడిపోయింది.
మార్కెట్ సెంటిమెంట్, ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివిటీ. బలమైన లోన్ గ్రోత్ (19% YoY) ఉన్నప్పటికీ FII అవుట్‌ఫ్లో ప్రభావం కనిపించింది.


Muthoot Finance షేర్ ధర రూ. 1,974.35 లు +1.2% పెరిగింది. గోల్డ్ లోన్ డిమాండ్ పెరిగింది, గోల్డ్ ధరల బలం వల్ల ఈ కంపెనీ నిలదొక్కుకుంది.
LIC Housing Finance షేర్ ధర రూ. 664.85లు కాగ -3.1% తగ్గింది. హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్‌లో మోడరేట్ గ్రోత్ (10% YoY), RBI రిస్క్ వెయిట్ రూల్స్ ప్రభావం చూపించాయి.
Aditya Birla Capital షేర్ ధర రూ. 225.80లు కాగ విలువ -4.2% తగ్గింది. మార్జిన్ ప్రెషర్, NBFC సెక్టార్ సెంటిమెంట్‌తో దెబ్బతింది.
Cholamandalam Inv. షేర్ ధర రూ. 1,501.00లు కాగ -1.8% పడిపోయింది. వెహికల్ ఫైనాన్స్ డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, లిక్విడిటీపై ఆందోళనలు దెబ్బ తీశాయి.
Piramal Enterprises షేర్ ధర రూ. 1,056.50లు కాగ విలువ -5.0% తగ్గింది. Jio Financial Services షేర్ విలువ రూ. 295.85 కాగ -6.77% తగ్గింది.

Leave a Reply