ప్ర‌జాస్వామ్యం వైపు అడుగులు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ (Telangana) బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన జాతీయ సమైక్యతా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండా(national flag)ను ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారన్నారు. పోరాట యోధుల (fighters)కు, అమర వీరులందరికీ శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ అంటే త్యాగాల గ‌డ్డ‌!
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం (armed peasant struggle) నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం (Telangana movement) వ‌ర‌కూ జ‌రిగింద‌ని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసింద‌న్నారు. చాకలి ఐలమ్మ. షేక్ బందగి, రావి నారాయణరెడ్డి (Ravi Narayana Reddy) వంటి ఎందరో అమరవీరులు ఈ తెలంగాణాలో జన్మించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామ‌న్నారు. ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ (Olympics) గురించి మాట్లాడుతోందని అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వంపైన భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పోరాడుతూనే ఉంటుంది అని కేటీఆర్ అన్నారు.

Leave a Reply