Statue | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

Statue | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

  • విగ్రహావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Statue | హన్మకొండ కలెక్టరేట్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇవాళ‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Sneha Shabarish) ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం(Telangana song) ప్లే చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వైవి గణేష్, డీఆర్డీవో మేన శ్రీను, ఆర్అండ్ బీ ఈఈ సురేష్ బాబు, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, డీటీఓ శ్రీనివాస్ కుమార్, హన్మకొండ, కాజీపేట తహసీల్దార్లు రవీందర్ రెడ్డి(Ravinder Reddy), బావుసింగ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య, సివిల్ సప్లయ్ డీఎం మహేందర్, జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, జిల్లా అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply