State Govts | ఏజెన్సీ గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తా !

State Govts | ఏజెన్సీ గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తా !

  • ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ముందుంటా.
  • సర్పంచ్ అభ్యర్థి బానోతు అఖిల

State Govts | నర్సంపేట, ఆంధ్రప్రభ : రాజుపేట ఏజెన్సీ గ్రామపంచాయతీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉంటారని బానోతు అఖిల అన్నారు. నర్సంపేట మండలంలో ఏకైక ఏజెన్సీ పంచాయతీగా ఉన్న రాజుపేట సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతురాలైన భారత అఖిలను అధిక మెజార్టీతో గెలిపిస్తే తను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల(State Govts) అభివృద్ధి నిధులతో అభివృద్ధి చేస్తాను అన్నారు.

గ్రామపంచాయతీలో నిలిచి ఉన్న అంతర్గత రోడ్లు సైడు కాలువల డ్రైనేజీలను పూర్తి చేస్తానని, రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లను ఇప్పిస్తానని తెలిపారు. ఏటూరు నాగారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ నుండి వచ్చే నిధులతో ఏజెన్సీ గ్రామపంచాయతీల వాటాను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని అఖిల పేర్కొన్నారు.

365 జాతీయ రహదారి ఆనుకొని ఉన్న రాజుపేట కు రహదారి(highways) వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న తండాలకు రోడ్డు సౌకర్యం(road facilities) కల్పించడంలో ముందు వరుసలో ఉంటారని తెలిపారు. గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించడం కోసం అధికారులతో మాట్లాడి నడిపిస్తారని తెలిపారు.

తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామపంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. గ్రామపంచా యతీ పరిధిలో ఉన్న రాజుపేట, గార్లగడ్డ తండాలో జంక్షన్ లైట్లు చేయిస్తానని తెలిపారు. గ్రామపంచాయతీ వచ్చే నిధుల(funds)తో పాటు ఐటీడీఏ నుండి వచ్చే నిధులను తెచ్చి ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తానని అందరి సహకారం తో ఎన్నికల్లో గెలిచి మంచినీటి సౌకర్యం కల్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని, అఖిల తనను ఓటర్లు ఆశీర్వదించి అత్యధిక కోట్లతో గెలిపిస్తే విద్యార్థికి అందరికీ సేవ చేస్తానని అఖిల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave a Reply