స్వచ్ఛ గ్రామపంచాయతీగా పత్తికొండకు రాష్ట్ర అవార్డు
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో భాగంగా రాష్ట్రస్థాయి స్వచ్ఛ గ్రామపంచాయతీగా పత్తికొండ ఎంపికైంది. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఏపీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి గుర్రాల భాస్కర్, పత్తికొండ డిప్యూటీ ఎంపీడీవోతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ గ్రామపంచాయతీ అవార్డును స్వీకరించారు.
పత్తికొండ గ్రామపంచాయతీలో పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలను గుర్తించి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు లభించడం పట్ల పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
