Start | కార్నియల్ డొనేషన్ సెంటర్ ప్రారంభం

Start | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రభుత్వ సర్వజన వైద్యశాల మచిలీపట్నం నందు కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా కార్నియల్ డొనేషన్ సెంటర్ ప్రారంభించారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థలో భాగంగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా నేత్రదాన శిబిరాలు దానం చేసిన నేత్రాలను నిలువ చేయడానికి సంబంధించిన ఐ డొనేషన్ సెంటర్ ను ఈ రోజు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్, పీవీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టిటికే.రెడ్డి, సర్వజన వైద్యశాల పర్యవేక్షణ అధికారిని డాక్టర్ ఆశలత సంయుక్తంగా ప్రారంభించారు.
మొదట ఐ డొనేషన్ సెంటర్ ప్రారంభించిన తర్వాత నేత్ర నిధిని ఆ తర్వాత కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడానికి తగిన శాస్త్ర చికిత్స పరికరాలు అందుబాటులో రానున్నాయని జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ జి.భానుమూర్తి తెలిపారు. తర్వాత జరిగిన అవగాహన సదస్సులో నేత్రదానము దాని ఆవశ్యకత తదితర విషయాల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్, డాక్టర్ డాక్టర్ ఆశలత డాక్టర్ నిరంజన్, డాక్టర్ శేషు కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లీలా ప్రసాద్ వివరించారు. తర్వాత అగర్వాల్ ఐ హాస్పిటల్ మేనేజర్ రాజీవ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వచ్చిన రోటరీ క్లబ్ స్ఫూర్తి ఫౌండేషన్ కొల్లు ఫౌండేషన్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
కృష్ణాజిల్లా యందు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందు అగర్వాల్ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎవరైతే చనిపోయిన తర్వాత నేతరాలను దానం చేయాలనుకుంటున్నారో వారు చనిపోయిన నాలుగు గంటల లోపల నేత్ర నిధిని సంప్రదించినట్టయితే ఇమీడియట్గా టెక్నిషన్స్ వచ్చి నేత్రాలను సేకరించి భద్రపరుస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రాం జయప్రదం కావడానికి తోడ్పడిన ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు జిల్లా అంతత్వ నివారణాధికారి భానుమూర్తి తెలిపారు.
