మంగళగిరి టౌన్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ విద్యను అందిస్తోన్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్రీడల్లోనూ ప్రదమా స్థానంలో నిల బడటం అభినందనీయమని ఒలింపిక్స్ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యురాలు పద్మశ్రీ పీటీ ఉష పేర్కొన్నారు.
క్రీడలకు ఎంతో ప్రాధాన్యతవెస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను అందిస్తోన్న వర్శిటీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నానన్నారు గురువారం సాయంత్రం ఏపీఎస్ఎం యూనివర్సిటీలో ఉద్దమ్ -25 జాతీయ క్రీజోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పి టి ఉష క్రీడా జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ ఆరోరా అధ్యక్షతన జరిగిన క్రీడల ప్రారంభ వేదికపై ఆమె ప్రసంగించారు. కృషి, పట్టుదల, ఏకాగ్రతతో సాధన చేస్తే క్రీడల్లో అత్యుత్తమంగా రాణించవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ఇస్తోన్న ప్రాధాన్యత ప్రశంసనీయమన్నారు. మనసు పెట్టి ఆడాలి… అప్పుడే మనలోని అసలైన క్రీడాశక్తి బయటకొస్తుంది అని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార, డీన్ వినాయర్, సీఎఫ్ ఏవో సుమ రీసెర్చ్ డిన రంజి త్, డైరెక్టర్ సిద్ధార్థ ప్రసారీ, డైరెక్టర్ రేవతీ బాలక్రిష్ణ, శ్రీపతి, వంశీ, విద్యార్ధి సంఘ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.