- ఆర్జిత సేవలు రద్దు..
తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 9 నుండి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాలలో తొలిరోజు శ్రీసీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
రెండవ రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా నాలుగవరోజు 5సార్లు,చివరి రోజు ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు..
తెప్పోత్సవాల కారణంగా మార్చి 9,10వ తేదీల్లో సహస్రదీపాలంకరణ సేవ,11,12,13వ తేదీలలో ఆర్జి తబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.