Srisailam మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు – పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
నంద్యాల బ్యూరో, ఎన్టీఆర్ బ్యూరో. ఆంధ్రప్రభ – మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, లు కలిసి బ్రమరాంబ స మల్లికార్జున స్వాముల వరకు పట్టు వస్త్రాలను సందర్శించారు.
ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ లు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా ఆలయ గోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాసరావు ఆలయ పండితులు అర్చక స్వాములు వేద పండితులు మంత్రికి శాసనసభ్యులకు స్వాగతం పలికారు. ఎంతో చారిత్రిక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో చక్రవర్తులు, రాజులు రాజవంశీయులు ఎందరో పట్టు వస్త్రాలను సమర్పించారని ప్రతీక ఉంది. ఈ సాంప్రదాయం అనుసరించే ప్రతి ఏడాది ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీ ఉంది.
మల్లికార్జున స్వామి కి కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు…

మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకొని శ్రీ శైలం భ్రమరాంబసమేత మల్లికార్జున స్వామి వారికి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరుల తరపున పట్టు వస్త్రాలను సాంప్రదాయ బద్ధంగా సమర్పించారు. కనకదుర్గమ్మ దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పట్టు వస్త్రాలను ఆదివారం శాస్త్రక్తంగా సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ఆలయ అధికారులను శ్రీ శైలం ఆలయ దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు, వేద పండితులు, అర్చకులు విజయవాడ నుండి విచ్చేసిన బృందాన్ని స్వాగతించి, ఆలయ మర్యాదలతో ఆలయం లోనికి తోడ్కోని వెళ్లారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమం లో విజయవాడ ఆలయ స్థానాచార్య శివ ప్రసాద శర్మ తదితరులు పాల్గొన్నారు.