వేములవాడకు చేరుకున్న శృంగేరి స్వామి..

వేములవాడ : శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామివారు ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చేరుకున్నారు.

శృంగేరి పీఠాధిపతి వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకు రాగానే, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీనివాస్… స్వామి వారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం, పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులతో పీఠాధిపతికి స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలతో కూడిన ఊరేగింపును నిర్వహించారు.

స్వామివారు ఆదివారం రాత్రి రాజన్న సన్నిధిలో బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఆయన శంకరమఠంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

అంతేకాకుండా, దేవస్థానం విస్తరణ మరియు అభివృద్ధి అంశాలపై శృంగేరి పీఠాధిపతి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Leave a Reply