Sri City | నేడు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు వచ్చి చేరింది.. ఈ రోజు శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్… 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు..

శ్రీసిటీలో ఎల్‌జీ గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ఉద్యోగావకాశాలతో పాటు.. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ కీలక ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక దిగ్గజం ఎజీ సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు తిరుపతి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీసిటీ వేదిక కానున్నది. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆ ప్లాంట్ కు పలురకాల రాయితీలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి దశలో 188 ఎకరాలను కేటాయించింది.

1500 మందికి ప్రత్యక్షంగా, మరో అయిదారు వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది.. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 కింద ప్రకటించిన రాయితీలకు ప్రతిస్పందించిన ఎల్‌జీ యాజమాన్యం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి లాంఛనంగా ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత దశలో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలో దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ బహుళ ఉత్పత్తుల వాణిజ్య నగరంగా పేరొందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడ ను ఎల్ జి సంస్థ ఎంపిక చేసుకుంది.

రూ 5,001 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన ఎల్జీ ప్లాంట్ కోసం దాదాపు 250 ఎకరాల స్థలం కావాలని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వ సతుల కల్పనా సంస్థ (ఏపిఐఐసి) ద్వారా శ్రీ సిటీ 2వ విస్తరణ పరిధిలోని కొల్లడం గ్రామ సమీపంలో తొలిదశలో 188 ఎకరాల స్థలాన్ని కేటాయించినా మలిదశలో మరో 70 ఎకరాల దాకా కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక 20 ఏళ్లపాటు వంద శాతం రాయితీతో నీటి సరఫరా చేయడానికి, పలు మినహాయింపులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించడానికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది.

మరో రెండేళ్లలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.. ఈ రోజు ఉదయం కంపెనీ కి సంబందించిన భూమి పూజా, శంకుస్థాపన చేయానున్నారు లోకేష్‌. దానికి సంబంధించిన పనులు పూర్తిచేశారు జిల్లా అధికారులు… తిరుపతి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు వస్తున్న తరుణంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు..

Leave a Reply