- ఇన్నింగ్స్ కాపాడే ప్రయత్నంలో సంజు..
ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ తో జరుగుతున్న మ్యాచ్ లో.. రాజస్థాన్ రాయల్స్ క్రమంగా పుంజుకుంటుంది. భారీ ఛేదనలో ఐదోవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోగా.. సంజు శాంసన్ ఇన్నింగ్స్ కాపాడే పనిలో పడ్డాడు. ధ్రువ్ జురేల్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ క్రమంలో మెరుపు వేగంతో 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో – 50 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు ధ్రువ్ జురేల్ (45) కూడా దూకుడుగానే ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 68 పురుగులు జోడించారు.
ప్రస్తుతం క్రీజులో సంజు శాంసన్ (50), ధ్రువ్ జురెల్ (45) ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్ఆర్ స్కోరు 118/3.
కాగా, ఎస్ఆర్‌హెచ్ నిర్ధేశించిన 287 పరుగుల భారీ ఛేజింగ్‌లో ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాస్ (1) తొలి వికెట్ గా వెనుదిరగగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (4) పెవిలియన్ చేరాడు. ఐదవ ఓవర్ మొదటి బంతికి నితీష్ రాణా (11)ను డగౌట్ కు చేరాడు.

