జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు వన్డేలను గెలుచుకున్న భారత్ ఇవ్వాలమూడో వన్డే ఆడుతోంది. మూడో వన్డేలో భారత పేసర్ దీపక్ చాహర్ ఆరంభంలోనే సత్తా చాటాడు. అతని బౌలింగ్‌లో జింబాబ్వే ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. యార్కర్ లెంగ్త్‌లో ఆఫ్‌స్టంప్ మీదకు వేసిన ఇన్‌స్వింగర్ బంతిని ఆడటంలో కాయా విఫలమయ్యాడు. అయితే అంపైర్ అవుటివ్వ లేదు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడంతో రివ్యూలో అది అవుటని తేలింది. దీంతో కాయా మైదానం వీడాడు. ఆ జట్టు ఏడు పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement