Thursday, January 23, 2025

U19 WT-20 | యువ భార‌త్ హ్యాట్రిక్ విన్.. సూప‌ర్ సిక్స్ లో అమ్మాయిలు !

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన మన అమ్మాయిలు.. తాజా మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

ఈరోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేశారు. శ్రీలంకపై 60 పరుగుల తేడాతో విజయం సాధించిన యువ భారత జట్టు సూపర్-6లోకి ప్రవేశించింది.

- Advertisement -

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 118/9 పరుగులు సాధించింది. తెలుగమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష (49) రాణించింది. ఇక మిథిలా వినోద్ (16), జోషిత (14), కెప్టెన్ నిక్కి ప్రసాద్ (11), నామమాత్రపు పరుగులు చేశారు.

శ్రీలంక బౌలర్లలో ఏసేని తలగునె, ప్రముది, లిమాన్స తిలకరత్న తలో రెండు వికెట్లు తీశారు. చామోడి ప్రభోద, రష్మిక, మనుడి నానయక్కర ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక జ‌ట్టు కుప్పకూలింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. శ్రీలంక జట్టులో రష్మిక సెవ్వండి (15) మినాహా ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

టీమిండియా బౌలర్లలో షబ్నమ్‌, జోషిత, పరుణికా సిసోధియా తలో రెండు తీశారు. వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా తలో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement