ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 యూత్ టెస్ట్ సిరీస్‌ను యువ భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఆసీస్‌పై ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ ఆసీస్‌ను ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది.
హర్వాంష్ పంగళియ (117) సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 215 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ కెప్టెన్ ఒలీవర్ పీక్ (117) శతకం సాధించాడు.
అనంతరం ఫాలో ఆన్‌కు దిగిన కంగారూ జట్టుకు మరోసారి భారత బౌలర్లు హడలెత్తించారు. దీంతో ఈసారి ఆసీస్ కేవలం 95 పరుగులకే కుప్పకూలి ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అన్మోల్‌జీత్ సింగ్ (4/72), (5/32) రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా యువ భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.