Tuesday, November 19, 2024

T20 World Cup: టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో యంగ్ డైన‌మైట్స్

2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ వేదికపై తమదైన ముద్ర వేయడానికి యువ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఉత్తేజకరమైన కొత్త ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ మెగాటోర్నీ సైతం ముస్తాబైంది. జూన్‌ 1న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం అవుతుంది.

వెస్టిండీస్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 సమరంలో సూపర్‌ స్టార్‌ ఆటగాళ్లతోపాటు యువ స్టార్లు సత్తా చాటబోతున్నారు. అత్యుత్తమ సామర్థ్యాలతో కొన్ని ఉత్కంఠభరితమైన క్షణాలను ప్రదర్శించగల వర్ధమాన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.

- Advertisement -

భారత్‌: యశస్వి జైస్వాల్‌ (బ్యాటర్‌)
యశస్వి జైస్వాల్‌ ఒక మంచి యువ బ్యాట్స్‌మెన్‌. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో నిలకడగా అద్భుత ప్రదర్శనతో శెభాష్‌ అనిపించుకున్నాడు. ఓవైపు దూకుడైన బ్యాటింగ్‌, మరొకవైపు ఒత్తిడి సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లను నిర్మించగల సామర్థ్యం అతడి ప్రత్యేకత. ఈ రెండు లక్షణాలతో అతడు నమ్మకమైన ఆటగాడిగా టీమిండిలో చోటుదక్కించుకున్నాడు. చిన్న వయస్సులోనే అసాధారణ సాంకేతిక నైపుణ్యం, పరిపక్వత యశస్వికి అదనపు బలాలు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ ఇండియా తరఫున అత్యంత ఉత్తేజకరమైన ఆటగాళ్లలో ఒకడిగా యశస్వి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

ఇంగ్లండ్‌: హ్యారీ బ్రూక్‌ (బ్యాటర్‌)
23 ఏళ్ల హ్యారీ పూర్తిస్థాయి బ్యాటర్‌. తన దూకుడు బ్యాటింగ్‌ శైలితో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తుఫాను సృష్టించాడు. వేగంగా పరుగులు సాధించగలడు. కొన్నిసార్లు సాహసోపేతమైన షాట్లతో అలరించనూ గలడు. ఇంగ్లండ్‌ భవిష్యత్‌ స్టార్‌ ప్లేయర్‌గా అతనికి సీనియర్ల నుంచి ఇప్పటికే ప్రశంసలు అందాయి.

అప్ఘ‌నిస్తాన్‌: నూర్ అహ్మద్‌ (కీపర్‌-బ్యాటర్‌)
19 ఏళ్ల నూర్‌ అహ్మద్‌ కీపింగ్‌ ఆల్‌రౌండర్‌. సమర్థుడైన వికెట్‌ కీపర్‌. నమ్మకమైన బ్యాటర్‌ కూడా. ఇప్పటికే దేశవాళీ టోర్నమెంట్లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌ శైలితో అందరినీ ఆకట్టుకున్నాడు. భారీషాట్లు ఆడేందుకు ఏమాత్రం వెనకాడడు. క్లీన్‌ సిక్సర్లు బాదడంలో బెస్ట్‌ప్లేయర్‌. ఛేజింగ్‌ సమయంలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి పరుగులు చేయగల దిట్ట. ఒక్కమాటలో చెప్పాలంటే గేమ్‌ఛేంజర్‌.

బంగ్లాదేశ్‌: త తౌహిద్ హృదయ్‌ (బ్యాటర్‌)
ఇతను యువ ఎడమచేతి వాటం బ్యాటర్‌. ఇటీవలి బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. ప్రపంచకప్‌లోనూ అదేఫామ్‌ను కొనసాగించే జోరులో ఉన్నాడు. తన సొగసైన స్ట్రోక్‌ప్లేతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం కలవాడు. తద్వారా అతను టీమ్‌ బంగ్లాదేశ్‌కు కీలక ఆటగాడిగా మారాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో అత్యంత విలువైన ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెనడా: కన్వర్‌పాల్‌ తత్గూర్‌ (పేస్‌ బౌలర్‌)
భారత సంతతికి చెందిన కన్వర్‌పాల్‌ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌. తన రా పేస్‌, స్వింగ్‌బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ఎక్స్‌ప్రెస్‌ డెలివరీలతో బ్యాటర్‌ల దూకుడికి కళ్లెం వేయగలదిట్ట. జూన్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌లో కెనడాకు ఆశ్చర్యకరమైన డైనమైట్‌గా మారవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement