Friday, November 22, 2024

IPL : య‌ష్ ఠాకూర్….స‌రికొత్త రికార్డ్

స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో గుజరాత్‌ను లఖ్‌నవూ 33 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌ పతనంలో కీలక పాత్ర యువ బౌలర్ యశ్‌ ఠాకూర్‌దే . ఐదు వికెట్ల (5/30) ప్రదర్శన చేసిన అతడు.. ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ కొట్టాడు.

- Advertisement -

ఈ క్రమంలో ఈ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి (ఇన్నింగ్స్‌ 15వ ఓవర్) మెయిడిన్‌ చేసిన బౌలర్‌గా అవతరించాడు. దీంతోపాటు ఈ సీజన్‌లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

గిల్‌ వికెట్‌ స్పెషల్: యశ్
”ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగా. దానిని అమలు చేయమని కేఎల్ రాహుల్‌ సూచించాడు. అది విజయవంతమైంది. దురదృష్టవశాత్తూ మయాంక్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోమని కేఎల్ మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్‌లో తొలిసారి గుజరాత్‌పై మేం విజయం సాధించాం. గిల్‌ను ఔట్‌ చేయడమే గుర్తుండిపోతుంది” అని యశ్‌ ఠాకూర్ వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement