ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్‌కు చెందిన రెండోసీడ్ యమగూచి టాప్‌సీడ్ తైజు యింగ్‌పై 21-14, 21-11తేడాతో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది. 39నిమిషాల్లో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో యమగూచి విజేతగా అవతరించింది. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్, చైనీస్‌తైపీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్ ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. యమగూచి ప్రస్తుతం ప్రపంచ నంబర్ త్రీగా ఉంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో థాయ్‌లాండ్ జోడీ డెచాపోల్ పువారానుక్రో, సప్సీరి తారత్తనాచై టైటిల్ గెలుచుకుంది. జపాన్ జోడీ యుటా వటానబే, అరిసా హిగాషినోను 21-13, 21-14తో ఓడించి పసిడి పతకాన్ని గెలచుకుంది. మహిళల డబుల్స్‌లో చైనా జోడీ చెన్‌క్వింగ్-చెన్‌జియా దక్షిణకొరియా జోడీని 21-16, 21-17తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital