Thursday, November 21, 2024

ఫైనల్ కి ఆరో రోజు రిజ‌ర్వ్ డే..

రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత టెస్ట్ చాంపియ‌న్‌షిప్ చివ‌రి మ‌జిలీకి చేరింది. 2019లో ఈ చాంపియ‌న్‌షిప్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 9 జ‌ట్ల‌తో కూడిన పాయింట్స్ టేబుల్‌లో భార‌త్‌, కివీస్‌లు టాప్‌లో నిలిచాయి. కోహ్లీ సేన తొలి స్థానంలో నిలువ‌గా.. కివీస్ రెండో స్థానంలో నిలిచింది.

సౌతాంప్ట‌న్ స్టేడియంలోకి ప్ర‌తి రోజు 3200 మంది ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు. ఇప్ప‌టికే మొద‌టి నాలుగు రోజుల కోసం టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. అయితే బుధ‌వారం రోజును రిజ‌ర్వ్ డేగా ప్ర‌క‌టించారు. ఒక‌వేళ అయిదు రోజులు జ‌రిగే టెస్ట్ మ్యాచ్‌లో ఏమైనా టైమ్‌ను కోల్పోతే అప్పుడు రిజ‌ర్వ్ డే రోజున మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. కేవ‌లం అయిదు రోజుల్లో కోల్పోయిన స‌మ‌యం కోసం మాత్ర‌మే ఆర‌వ రోజును వినియోగించ‌నున్నారు. ఒక‌వేళ అయిదు రోజులు పూర్తి మ్యాచ్ జ‌రిగితే, అప్పుడు రిజ‌ర్వ్ డేతో ప‌ని ఉండ‌దు. మ్యాచ్ డ్రా అయితే.. 1.7 మిలియ‌న్ల పౌండ్ల ప్రైజ్‌మ‌నీ ఇరు జ‌ట్ల‌కు అప్ప‌గిస్తారు. టెస్ట్ మేస్‌తో పాటు ట్రోఫీని అంద‌జేస్తారు. సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement