భారత్‌తో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నాడు న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్. అయితే అంతకన్న ముందు న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఫలితంగా టీమిండియాతో పోలిస్తే ఇంగ్లండ్ గడ్డపై వారి సన్నాహకం చాలా మెరుగ్గా ఉండబోతోంది. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా తమ దృష్టిలో ఎంతో విలువుందని కివీస్ ప్రధాన పేసర్ నీల్ వాగ్నర్ అన్నాడు. టెస్టు సిరీస్‌లో విజేతగా నిలవడం కూడా ముఖ్యమన్నారు. ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుతో టెస్టు మ్యాచ్‌లను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు వామప్ మ్యాచ్‌లుగా చూడటం లేదు. ఆ రెండు టెస్టులు కూడా గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని వాగ్నర్ చెప్పాడు. మరో వైపు న్యూజిలాండ్ జట్టు సభ్యులు ఆది, సోమ వారాల్లో రెండు బృందాలుగా ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ అనంతరం మాల్దీవుల్లో ఆగిపోయిన విలియమ్సన్, జేమీసన్, సాన్‌ట్నర్ విడిగా ఇంగ్లండ్‌కు పయనమయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement