Tuesday, November 19, 2024

WTC FINAL: నాలుగు వికెట్లు తీస్తే అశ్విన్ టాప్..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవించంద్రన్‌ అశ్విన్‌ అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ 70 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ మైలురాయిని అధిగమించాలంటే అశ్విన్‌కు మరో నాలుగు వికెట్లు మాత్రమే కావాల్సి ఉంది. కమిన్స్‌ 14 టెస్టు మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీయగా, భారత స్పిన్నర్‌ అశ్విన్‌ 13 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ 10 మ్యాచ్‌లో 51 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. డబ్ల్యూటీసీలో అశ్విన్‌ భారత్‌లో 9 టెస్టులు, ఆస్ట్రేలియాలో మూడు, న్యూజిలాండ్‌లో ఒక టెస్టు ఆడాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జూన్‌ 18-22 మధ్య సౌతాంప్టన్‌ వేదికగా జరగనుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు బయల్దేరి వెళ్తుంది. కివీస్‌తో ఫైనల్‌ పోరులో అశ్విన్‌కు తుది జట్టులో దాదాపు చోటు దక్కే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement