టీమిండియా వరల్డ్ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా ఫర్వాలేదనుకున్న పరిస్థితుల్లో భారత్ మాత్రం మ్యాచ్‌ను ఘనవిజయంతో ముగించింది. దీంతో ఈ టెస్టును ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగో టెస్టులో విజయం సాధించి కోహ్లీ సేన ఈ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లారెన్స్ (50) ఒక్కడే రాణించాడు. అక్షర్ పటేల్ 5 వికెట్లతో, అశ్విన్ 5 వికెట్లతో రూట్ సేనను దెబ్బతీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్ల్లీష్ జట్టు 205 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా భారత్ 365 పరుగులు చేసింది. తద్వారా 160 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మూడో టెస్టులో ఓటమికి పిచ్ సాకులు చెప్పిన రూట్ సేన నాలుగో టెస్టులో ఓటమికి ఏం కాకమ్మ కథలు చెప్తుందో వేచి చూడాలి. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 18న ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement