కాసేపట్లో wtc ఫైనల్ ప్రారంభకానుంది. అయితే టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్‌లో నిలిచిన భారత్, న్యూజిలాండ్ జట్లలో .. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎవరు బెస్ట్ ఉన్నారో ఓసారి తెలుసుకుందాం. న్యూజిలాండ్ టీమ్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. 58.35 సగటుతో అతను 817 రన్స్ చేశాడు. రెండవ స్థానంలో టామ్ లాథమ్ ఉన్నారు. 40 సగటుతో అతను 689 రన్స్ చేశాడు. 41.78 సగటుతో 586 రన్స్ చేసిన హెన్రీ నికోల్స్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక ఇండియన్ జట్టులో అత్యధిక స్కోర్ చేసిన క్రికెటర్‌గా అజింక్య రహానే ఉన్నాడు. 43.80 సగటుతో అతను 1095 రన్స్ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 1030 రన్స్ చేశాడు. అతని సగటు 64.37గా ఉన్నది. ఇక కెప్టెన్ విరాట్ కో్లీ 43.85 సగటుతో 877 రన్స్ చేశాడు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ లో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శించిన న్యూజిలాండ్ క్రికెటర్లలో టిమ్ సౌతీ ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ 20.66 సగటుతో ఇప్పటి వరకు 51 వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో టిమ్ అత్యంత కీలక బౌలర్ కానున్నాడు. ఆ తర్వాత కైల్ జేమిసన్ 13.27 సగటుతో 36 వికెట్లు తీసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ తన ఖాతాలో ఇప్పటి వరకు 34 వికెట్లు వేసుకున్నాడు. అతని సగటు 29.29గా ఉన్నది. ఇక భారత జట్టు బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అశ్విన్ పేరిట ఉన్నది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 20.88 సగటుతో 67 వికెట్లు తీశాడు. ఇశాంత్ శర్మ 17.33 సగటుతో 36 వికెట్లు తీశాడు. ఇక షమీ 19.77 సగటుతో 36 వికెట్లు తీశాడు. ఇక ఇవాళ్టి నుంచి జరిగే ఫైనల్లో బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఎవరు ఉత్తమ ప్రదర్శన ఇస్తారో చూడాల్సిందే.