గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. సమీప భవిష్యత్తులో అతను భారత్ జట్టు సారథ్య బాధ్యతలు అందు కుంటాడని జోస్యం చెప్పాడు. ఐపీఎల్2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ గెలుపొం దడంలో కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడని చెప్పుకొచ్చారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందన్నాడు. గత రెండేళ్లుగా గాయాలతో సమతమతం అవుతూ ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో పూర్తిగా జట్టుకు దూరమైన పాండ్యాను సారథిగా ఎంచుకోవడం గుజరాత్ పిచ్చి అని విమర్శించారన్నారు.
కెప్టెన్‌గా ఎలాంటి అనుభవం లేదన్నారని, అనవసరంగా ఎంచుకున్నారని విమర్శించారని గుర్తు చేశారు. పాండ్యా మాత్రం అందరి నోళ్లు మూసేలా ఛాంపియన్‌గా నిలబెట్టాడని కొనియాడాడు. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఇది తన ఒక్కడి మాటే కాదని.. అందరి మాట అని చెప్పుకొచ్చాడు. ఏ ఆటగాడైనా.. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే.. సమీప భవిష్యత్తులో భారత్ జట్టుకు కెప్టెన్‌గా అయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..