తనపై వస్తున్న లైంగిక ఆరోపలను ఉద్దేశిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను నిస్సహాయకుడిగా మారిన రోజు.. చావును కోరకోనున్నట్లు తెలిపారు. మిత్రులారా అని సంబోధిస్తూ బ్రిజ్ భూషణ్ వీడియో సందేశాన్ని ఇచ్చారు. నేను ఓడానా లేక గెలిచానా అని ఆత్మవిమర్శ చేసుకున్న రోజు.. తనలో పోరాడేందుకు శక్తి లేదని గ్రహించిన రోజు.. తనను ఎవరూ ఆదుకోలేరని గ్రహించిన రోజు.. అప్పుడు మరణాన్నే ఆశ్రయిస్తానని, ఎందుకంటే అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని బ్రిజ్ భూషణ్ అన్నారు. భారత స్టార్ రెజ్లర్లు వినోశ్ ఫోగట్, సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు ఇతర మేటి అథ్లెట్లు .. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండోసారి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌పై చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. బ్రిజ్‌పై వేసిన కమిటీ తన రిపోర్టను తయారు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టును బయటకు రిలీజ్ చేయలేదు. అథ్లెట్లు వీధుల్లోకి వెళ్లి ధర్నా చేడయం సరికాదు అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. దీన్ని రెజ్లర్లు ఖండించారు.
ఆలాంటి రోజు వస్తే.. నా ప్రాణాలు వదిలేస్తా.. బ్రిజ్ భూషణ్ సింగ్
Advertisement
తాజా వార్తలు
Advertisement