– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించి భారత రెజ్లర్లు నిరసన తెలిపారు. ఇవ్వాల్టికి వారి ఆందోళనలు చేపట్టి నెల నిండినందున ఇండియా గేట్ వరకు వందలాది మందితో మార్చ్ ను నిర్వహించారు. బీజేపీ లీడర్లలో ముఖ్యుడైన రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) చీఫ్‌కు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో అథ్లెట్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్‌లతో సహా పలువురు రెజ్లర్లు పాల్గొన్నారు.
కాగా, మైనర్‌తో సహా పలువురు అథ్లెట్లపై లైంగిక దాడులకు పాల్పడినందుకు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను రాజీనామా చేయాలని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు జాతీయ జెండాను పట్టుకుని కవాతు నిర్వహించారు.