Sunday, September 22, 2024

T20 1st semis | ఇంత చెత్త రికార్డా…

టీ20 వరల్డ్‌కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం. ఏదో చిన్న జట్లు స్వల్ప స్కోర్ చేశాయంటే అనుకోవచ్చు.. కానీ టీ20 క్రికెట్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన జట్లు ఒక్కోసారి పేలవ ప్రదర్శన కనబరుస్తుంటాయి.

టీ20 ప్రపంచకప్‌ 2024 సెమీఫైనల్‌ తొలి మ్యాచ్‌లో ఆప్ఘానిస్తాన్ 56 పరుగులకే ఆలౌటైంది. సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘాన్ ఈ మ్యాచ్‌లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టగా ఆప్ఘనిస్తాన్ నిలిచింది.

- Advertisement -

అయితే టీ20 వరల్డ్‌కప్‌లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా మాత్రం వెస్టిండీస్ ఉంది. 2021లో దుబాయి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కేవలం 55 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా వెస్టిండీస్ ఉంది. ఆ తర్వాత స్థానంలో 56 పరుగులతో ఆప్ఘనిస్తాన్ నిలిచింది.

టీ20 వరల్డ్ కప్‌లో అతి తక్కువ స్కోర్ చేసిన మూడో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం కివీస్ 60 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 70 పరుగులు మాత్రమే చేసింది.

టీ20ల్లో ఆప్ఘాన్ చెత్త రికార్డులు..

టీ20 మ్యాచ్‌ల్లో ఆప్ఘనిస్తాన్ అత్యుత్తమ ప్రదర్శనతో పాటు పేలవ ప్రేదర్శన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించి టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌కు చేరిన ఆ జట్టు సెమిఫైనల్స్‌లో కేవలం 56పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులు చేయగా.. 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 80 పరుగులు, 2012లో ఇంగ్లాండ్‌తో కొలంబోలో జరిగిన టీ20 మ్యాచ్‌లో 80 పరుగులు చేసింది.

సౌతాఫ్రికాతో..

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో ఆప్ఘనిస్తాన్‌తో పాటు వివిధ జట్లు వందకంటే తక్కువ పరుగులు చేశాయి. టీ20 వరల్డ్‌ కప్2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైంది. 2010లో ఆప్ఘనిస్తాన్ 80 పరుగులు చేయచగా.. 2009లో స్కాట్లాండ్‌ 81 పరుగులు చేసింది. ఇలా సౌతాఫ్రికాపై వందకంటే తక్కువ పరుగులు చేసిన జట్లు మూడు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement