20 వరల్డ్ కప్-2024లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. బార్బడోస్ వేదికగా నమీబియా-ఒమన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టైగా ముగిసింది. స్వల్ప స్కోరు నమోదైన ఈ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది.
చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో నమీబియా ఒక్క పరుగే సాధించడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రంపెల్మన్ (4/21) నాలుగు వికెట్లు, వైసే (3/28) మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో నమీబియా 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడాడు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఛేదనలో నమీబియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఖాతా తెరవకముందు ఓపెనర్ మైకేల్ డకౌటయ్యాడు. మరో ఓపెనర్ నికోలాస్ (24; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి జేన్ ఫ్రైలింక్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు నమీబియా ఫేవరేటులో ఉంది. కానీ మెహ్రన్ ఖాన్ బంతి అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. నమీబియా వరుసగా వికెట్లు కోల్పోయింది.
ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగులు అవసరమవ్వగా మెహ్రన్ రెండు వికెట్లు తీసి నాలుగు పరుగులు ఇచ్చాడు.