Friday, November 22, 2024

World cup – సూప‌ర్ 8లో ఇంగ్లండ్…న‌మీబియాపై విజ‌యం

టీ20 వరల్డ్‌కప్‌ 2024 సూపర్‌-8 లో ప్ర‌వేశించింది.. అసీస్ తుదిపోరులో స్కాట్లాండ్ పై గెలుపొంద‌డంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది.. కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. నమీబియాను ఓడించింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను హ్యారీ బ్రూక్‌ (20 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు), మొయిన్‌ అలీ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), లివింగ్‌స్టోన్‌ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జోస్‌ బట్లర్‌ డకౌటయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్‌మన్‌ 2, డేవిడ్‌ వీస్‌, బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 123 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. ఇంగ్లండ్‌ బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

- Advertisement -

నమీబియా ఇన్నింగ్స్‌లో వాన్‌ లింగెన్‌ 33, నికోలాస్‌ 18 (రిటైర్డ్‌ హర్ట్‌), డేవిడ్‌ వీస్‌ 27 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సూపర్‌-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ సూపర్‌-8కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ భారీ తేడా ఓట‌మి చెందింది.. దీంతో ఇంగ్లండ్ కు రూట్ క్లియ‌ర్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement