వెస్టిండీస్-అమెరికా వేదికలుగా జూన్ 2 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. అయితే ఆ మెగా సమరం కోసం 20 మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. వీరిలో భారత్ నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. 20 మంది అంపైర్లలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యత్వం పొందిన అంపైర్లు 16 మంది ఉండగా.. మరో నలుగురు అంపైర్లు ఎమర్జింగ్ ప్యానెల్‌లో ఉన్నారు.
ఇందులో భారత్ నుంచి కూడా ఇద్దరు నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్ చోటు దక్కించుకున్నారు. నితిన్ మీనన్‌కు ఇప్పటికే ఐసీసీ ఈవెంట్‌లో అంపైరింగ్ చేసిన అనుభవం ఉండగా.. మదన గోపాల్‌కు మాత్రం తొలిసారి మెగా ఈవెంట్‌లో అంపైరింగ్ చేసే అవకాశం లభించింది. ఇయనతో పాటు సామ్ నొగాజ్‌స్కీ, రషీద్ రియాజ్, అల్లావుదీన్ పాలేకర్, ఆసిఫ్ యాకూబ్‌లు సైతం మొదటిసారి ఐసీసీ ఈవెంట్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్థించనున్నారు. అలాగే 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసే, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు ఈ మెగా టోర్నీ కోసం ఆరుగురు మ్యాచ్ రిఫరీల పేర్లను కూడా ఐసీసీ ప్రకటించింది. భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ మరోసారి ఐసీసీ రిఫరీగా ఎంపికయ్యాడు.
టీ20 వరల్డ్‌కప్-2024 అంపైర్లు వీరే..
క్రిస్ బ్రౌస్, కుమార్ ధర్మసేన, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లావుదీన్ పాలేకర్, రిచర్డ్ కెలిట్‌బరో, సామ్ నొగాజ్‌స్కీ, అహ్‌సాన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రుసెర్, షాహిద్ సైకత్, రొడ్‌నే టక్కర్, అలెక్స్ వార్ఫ్, జొయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.
మ్యాచ్ రిఫరీల జాబితా: జవగల్ శ్రీనాత్ (భారత్), డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా), జెఫ్ క్రోవ్ (న్యూజిలాండ్), రంజన్ మదుగుల్లె (శ్రీలంక), ఆండ్రీవ్ పైక్రాఫ్ట్ (జింబాబ్వే), రీచి రిచర్డ్‌సన్ (వెస్టిండీస్).