Wednesday, November 20, 2024

WBC | ఐపీబీఎల్‌కు వరల్డ్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ అమోదం..

భారత బాక్సింగ్‌ ప్రేమికులకు వరల్డ్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూబీసీ) నుంచి భారీ గుడ్‌ న్యూస్‌ లభించింది. ఇండియన్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లీగ్‌ (ఐపీబీఎల్‌), 12ఆర్‌ ఫాంటసీ బాక్సింగ్‌ యాప్‌కు వరల్డ్‌ బాకింగ్స్‌ కౌన్సిల్‌ నుంచి అధికారికి అమోదం లభించింది. దాంతో భారత్‌లో డబ్ల్యూబీసీ గుర్తింపు పొందిన ఏకైక ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లీగ్‌గా ఐపీబీఎల్‌గా నిలిచింది. ఈ లీగ్‌ ద్వారా ఔత్సాహిక భారత బాక్సర్లకు విశ్వవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది.

ఈ విషయాన్ని ప్రముఖ టాలీవుడ్‌ నటుడు, ఐపీబీఎల్‌ అడ్వైజర్‌ రానా దగ్గుబాటి అధికారికంగా వెల్లడించాడు. ఈ ఒప్పందం భారత బాక్సింగ్‌ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఆయన అన్నాడు. అలాగే భారత్‌లో బాక్సింగ్‌ను ప్రముఖ క్రీడాగా మార్చేందుకు ఐపీబీఎల్‌ బృందంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని రానా పేర్కొన్నాడు.

అలాగే భారత్‌లో బాక్సింగ్‌ ఎదుగుదల కోసం ఐండియన్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ (ఐబీసీ) వరల్డ్‌ బాకింగ్‌ కౌన్సిల్‌తో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నదని ఐసీబీఎల్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ సింగ్‌ అన్నాడు. ఈ మెగా లీగ్‌తో భారత యువ బాక్సర్లు తమ స్కిల్స్‌లను మెరుగు పర్చుకోవడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటేందుకు ఈ టోర్నీ చాలా ఉపయోగపడుతుందని ప్రశాంత్‌ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement