Tuesday, November 26, 2024

ప్రపంచ అథ్లెటిక్స్‌, నిరాశపర్చిన శ్రీశంకర్‌.. లాంగ్‌ జంప్‌లో ఫైనల్‌కు చేరినా ఫ‌లితం లేదు

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన మురళీ శ్రీశంకర్‌ తీవ్ర నిరాశపరిచాడు. అమెరికాలోని ఒరేగాన్‌ రాష్ట్రం హ్యూజిన్‌లోని హెవార్డ్‌ స్టేడియంలో ఆదివారంనాడిక్కడ జరిగిన ఫైనల్‌లో శ్రీశంకర్‌ 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 7.96 మీటర్లు మాత్రమే జంప్‌ చేసి పతకాన్ని చేజార్చుకున్నాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 8 మీటర్లు దూకిన 23ఏళ్ల మురళీ శ్రీశంకర్‌ గ్రూప్‌-బీలో రెండో స్థానం, మొత్తమ్మీద ఏడో స్థానంలో నిలిచాడు. అయితే ప్రపంచ అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత అథ్లెట్‌గా శ్రీశంకర్‌ ఘనత సాధించాడు.

ఇక భారత ఆర్మీ క్రీడాకారుడైన అవినాశ్‌ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో 8:18.75 టైమింగ్‌తో హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి నేరుగా పతక రౌండ్‌కు అర్హత సాధించాడు. మహిళల 3వేల స్టీపుల్‌ చేజ్‌లో పారుల్‌ చౌదరి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె రికార్డు ప్రదర్శనను కూడా కనబర్చలేకపోయింది. 9.38.09 టైమింగ్‌తో ఫైనల్‌ బెర్త్‌ కోల్పోయింది. 400 మీటర్ల హర్డిల్స్‌ హీట్‌లో ఎంపీ జబీర్‌ నిష్క్రమించాడు. 50.76తో ఏడో స్థానంలో నిలిచాడు. ఇక షాట్‌పుట్‌ స్టార్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ పోటీకి దిగకుండానే గజ్జల్లో గాయంతో తప్పుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతడికి గాయం కాగా, నొప్పి తగ్గకపోవడంతో పోటీ నుంచి వైదొలగాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన అవకాశం లేదని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement