మహిళల అండర్ -19 2025 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా…. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. సెమీస్, పైనల్‌తో కలిపి మొత్తం 41 మ్యాచులు జరగనున్నాయి.
ఇక ఈ టోర్నీలో భారత మహిళల జట్టు వెస్టిండీస్, శ్రీలంక, మలేషియాలతో పాటు గ్రూప్-ఎలో ఉంది.
గ్రూప్-బిలో ఇంగ్లండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా,
గ్రూప్-సిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా,
గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ గ్రూప్ డిలో ఉన్నాయి.
ఫిబ్రవరి 1న జరిగే సెమీ-ఫైనల్, ఫిబ్రవరి 3న ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేస్ ప్రకటించారు. కాగా, అండర్ 19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్రపంచకప్. 2023లో తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది.