భారత మహిళా జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లెందుకు సిద్ధమైంది. భారత్- బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది.
స్టార్ ప్లేయర్ జెమీమా రొడ్రిగ్స్ గాయంతో ఈ పర్యటనకు దూరమైందని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం ఆమే ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షనలో కోలుకుంటోంది. ఇక ఈ టూర్ కోసం ఇద్దరూ వికెట్ కీపర్లు రిచా ఘోష్, యస్తికా భాటియలను భారత బృంధంలో చోటు కల్పించారు. మ్యాచ్‌లన్ని బంగ్లాదేశ్‌లోని సిల్‌హెట్ ఎస్‌ఐసీఎస్ స్టేడియంలో జరుగుతాయి.
బంగ్లా పర్యటనకు ఎంపికైన భారత బృందం:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, డాయలన్ హేమలత, సంజన సంజీవన్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియ (వికెట్ కీపర్), రాధ యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయంకా పాటిల్, సైకా ఇషాక్, ఆష శోభన, రేనుక సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు.