సౌతాఫ్రికాలో జరుగుతున్న విమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ స్టేజ్‌కి చేరింది. ఇవ్వాల ఆతిథ్య దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆసిస్ మహిళ జట్టు 156 పరుగులు చేసింది.
ఇక.. సఫారీ బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను సమర్థంగా కట్టడి చేశారు. భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. షబ్నిమ్ ఇస్మాయిల్ 2, మరిజానే కాప్ 2, ఎంలబా 1, క్లో ట్రయోన్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ బెత్ మూనీ అజేయంగా 74 పరుగులు చేసింది. ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 పరుగులు చేశారు. అనంతరం, 157 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లకు 94 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 31 బంతుల్లో 63 పరుగులు చేయాలి.