క్రికెట్ ప్రియులకు శుభవార్త. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మహిళల టీ20 ఛాలెంజ్ కోసం జట్లను, షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ టోర్నీ చివరగా 2020లో జరిగింది. కరోనా కారణంగా మహిళల టోర్నీ జరగలేదు. ఈవెంట్ నాల్గో సీజన్ మే 23న ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. అన్ని మ్యాచులు పూణలోని ఎంసీఏ స్టేడియంలో జరుగుతాయి. హర్మన్‌ప్రీత్ సూపర్నోవాస్కు నాయకతం వహిస్తుండగా.. ట్రైల్ బ్లేజర్స్‌కు మళ్లిd స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మునుపటి ఎడిషన్ వరకు మిథాలీ వెలాసిటీ జట్టుకు కెప్టెన్‌గా ఉండగా.. ఈసారి ఆమె అందుబాటులో ఉండటం లేదు. దీంతో వెలాసిటీ జట్టుకు ఆల్ రౌండర్ దీప్తి శర్మ నాయకత్వం వహించనుంది. ఝులన్ గోసామి, శిఖా పాండేలు ఈ ఏడాది ఆడట్లేదు.
ఒక్కో జట్టులో 16మంది ప్లేయర్లు
భారత్ మహిళా క్రికెట్లోని అత్యుత్తమ ప్లేయర్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాకు చెందిన కొంత మంది కీలక ప్లేయర్లతో కలిసి జట్లు ఏర్పడ్డాయి. ఈ ఏడాది మహిళల టీ20 ఛాలెంజ్‌లో మొత్తం 12 మంది అంతర్జాతీయ క్రీడాకారులు.. ఆడుతున్నారని బీసీసీఐ తెలిపింది. ఒక్కో జట్టులో 16 మంది ప్లేయర్లతో కూడి మూడు జట్లను ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మే 23న ట్రైల్ బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరుగుతుంది. 24న సూపర్ నోవాస్, వెలాసిటీ మధ్య, 26న ట్రైల్‌బ్లేజర్స్‌తో వెలాసిటీ తలపడుతుంది. ఈ మూడు మ్యాచుల్లో టాప్ 2 ప్లేస్‌లో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..