Sunday, November 17, 2024

National: మ‌హిళ బ్యాడ్మింట‌న్‌ల జోరు….తొలిసారి ఫైనల్‌కు…

భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు చ‌రిత్ర సృష్టించారు. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైన‌ల్‌లో అడుగుపెట్టారు. స్వ‌ర్ణానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. సెమీస్‌లో గెలిచి తొలిసారి పతకం ఖాయం చేసుకుంది భారత్‌.

జపాన్‌ టీమ్‌తో జరిగిన సెమీస్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇవాళ ఫైనల్లో థాయిలాండ్‌తో తలపడుతోంది భారత బ్యాడ్మింటన్ టీమ్.

- Advertisement -

శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. డబుల్స్‌లో పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ… సింగిల్స్‌లో అస్మిత, అన్మోల్‌ సంచలన విజయాలతో జట్టును ఫైనల్‌కు చేర్చారు. అయితే తొలి సింగిల్స్‌లోనే స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఓటమి పాలైంది. దీంతో భారత్‌ వెనుకబడగా… డబుల్స్‌లో గాయత్రి- ట్రీసా జంట ప్రపంచ ఆరో ర్యాంకు జోడీ మత్సుయమా-చిహారు షిడాను ఓడించి స్కోరు సమం చేశారు. రెండో సింగిల్స్‌లో అస్మిత కూడా ఊహించని ప్రదర్శన చేసింది. మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఒకుహరకు షాకిచ్చి భారత్‌ను 2-1తో నిలిపింది.

ఆధిక్యంలో ఉన్న భారత్‌కు డబుల్స్‌లో మళ్లీ చుక్కెదురైంది. తనీషా క్రాస్టోకు గాయం కావడంతో అశ్విని పొన్నప్పతో కలిసి సింధు బరిలో దిగింది. ఈ పోరులో అశ్విని ద్వయం 14-21, 11-21తో ఓడిపోయి స్కోర్లు మళ్లీ సమం అయ్యాయి. దీంతో చివరి లీగ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. చైనాతో చివరి లీగ్‌ మ్యాచ్‌లో 17 ఏళ్ల అన్మోల్‌ అదరగొట్టింది. చైనా ప్లేయర్‌ నిదైరాను ఓడించి భారత్‌కు 3-2 ఆధిక్యం… చరిత్రాత్మక విజయాన్ని అందించింది. దీంతో భారత బ్యాడ్మింటన్ టీమ్‌ ఫైనల్‌కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement