Friday, November 22, 2024

Sports | మహిళల ఆసియా హాకీ కప్‌.. 18 మందితో జూనియర్‌ జట్టు ఖరారు

జూన్‌ 2న జపాన్‌లోని కకమిగహారాలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ కోసం భారత్‌ బుధవారం 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. పూల్‌-ఎలో కొరియా, మలేషియా, చైనీస్‌ తైపీ, ఉజ్బెకిస్థాన్‌లతో భారత్‌ ఆడనుండగా, పూల్‌-బిలో ఆతిథ్య జపాన్‌, చైనా, కజకిస్థాన్‌, హాంకాంగ్‌ చైనా, ఇండోనేషియా ఉన్నాయి. టోర్నమెంట్‌ నుండి మొదటి మూడు దేశాలు ఈ సంవత్సరం జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి కాబట్టి జూనియర్‌ ఆసియా కప్‌ భారతదేశానికి కీలకమైన ఈవెంట్‌. భారత్‌కు ప్రీతి నాయకత్వం వహిస్తుండగా, దీపిక వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది.

జట్టులో గోల్‌కీపర్‌లుగా మాధురి కిండో, అదితి మహేశ్వరి ఉండగా, డిఫెండర్లుగా మహిమ టెటె, ప్రీతి, నీలం, రోప్ని కుమారి, అంజలి బర్వాలు ఎంపికయ్యారు. మిడ్‌ఫీల్డ్‌లో రుతాజా దాదాసో పిసల్‌, మంజు చోర్సియా, జ్యోతి ఛత్రీ, వైష్ణవి విఠల్‌ ఫాల్కే, సుజాత కుజుర్‌, మనశ్రీ నరేంద్ర షెడాగే ఉన్నారు. జూన్‌ 3న ఉజ్బెకిస్థాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత మలేషియా (జూన్‌ 5), కొరియా (జూన్‌ 6) చైనీస్‌ తైపీతో తలపడుతుంది. జూన్‌ 10న సెమీఫైనల్స్‌, జూన్‌ 11న ఫైనల్‌ జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement