భారత్ యంగ్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి దూసుకువెళ్లింది.. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శుక్రవారం పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను 8వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారిగా అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను కట్టుదిట్టమైన బంతులతో టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. దీంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 107 పరగులు చేసింది. భారత బౌలర్లలో పార్షవి చోప్రా మూడు వికెట్లు సాధించగా, సాధు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్ తీశారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 61 పరుగులతో నాటౌట్‌గా గెలిచి భారత్ ను ఫైనల్స్ కు చేర్చింది. మూడు వికెట్లు సాధించిన పార్షవి చోప్రాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్స్ లో తలపడనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement