కాన్పూర్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్టు మ్యాచ్‌లో అక్షర్ పటేల్ చెలరేగి ఆడుతున్నాడు. రెండో రోజు ఆటలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు.. మూడో రోజు పట్టుబిగించారు. ఈ క్రమంలోనే స్పిన్నర్ అక్షర్ పటేల్ ఐదు వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీసి తమ సత్తా చాటారు.
న్యూజిల్యాండ్ వెటరన్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (11)ను ముందుగా పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత హెన్నీ నికోల్స్ (2)ను ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ వెంటనే భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సెంచరీకి చేరువైన కివీ ఓపెనర్ టామ్ లాథమ్ (95)ను వెనక్కిపంపాడు.