Friday, November 22, 2024

టీ20 సిరీస్ కైవ‌సం చేసుకున్న విండీస్.. ఇంగ్లండ్ పై ఘ‌న విజ‌యం.. హోల్డర్‌ డబుల్‌ హ్యాట్రిక్‌

విండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ సోమవారం చారిత్రాత్మక ప్రదర్శనతో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి టీ20లో నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో 3-2 తేడాతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ను వెస్టిండీస్‌ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లకు 179పరుగులు చేసింది. విండీస్‌ ఓపెనర్స్‌ బ్రాండన్‌ కింగ్‌ 31బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లుతో 34పరుగులు, కే మేయర్స్‌ 19బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్‌లతో 31పరుగులు చేసి శుభారంభాన్ని అందించారు. వెస్టిండీస్‌ ఓపెనింగ్‌ జోడీని అదిల్‌రషీద్‌ విడదీసి మేయర్స్‌ను పెవిలియన్‌కు పంపడంతో 59పరుగులు వద్ద తొలి వికెట్‌ పడింది. కెప్టెన్‌ పొలార్డ్‌ 25బంతుల్లో ఓ ఫోర్‌, 2సిక్స్‌లతో 41పరుగులు, పావెల్‌ 17బంతుల్లో ఓ ఫోరు, 4సిక్సర్లతో 35పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మొత్తంమీద వెస్టిండీస్‌ 20ఓవర్లలో 4వికెట్లు నష్టానికి 179పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 180పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ 19.5 ఓవర్లలో 162పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జేమ్స్‌ విన్స్‌ 35బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్స్‌తో 55పరుగులు చేసి హాఫ్‌సెంచరీ సాధించగా వికెట్‌కీపర్‌ సామ్‌బిల్లింగ్స్‌ 28బంతుల్లో ఓ ఫోరు, 2సిక్స్‌లతో 41పరుగులు చేసి ఆకట్టుకున్నారు. అయితే మిగిలిన బ్యాటర్లు నుంచి వీరికి తగిన సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. చివరిఓవర్లో ఇంగ్లండ్‌ గెలిచేందుకు 20పరుగులు అవసరంకాగా విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ చివరి ఓవర్లో విజృంభించి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. 20వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన హోల్డర్‌ తొలి బంతిని నో బాల్‌గా వేశాడు. అనంతరం మొదటిబంతికి నోరన్‌, రెండో బంతికి జోర్డాన్‌ (7), మూడో బంతికి బిల్లింగ్స్‌ (41), నాలుగో బంతికి అదిల్‌రషీద్‌ (0) క్యాచ్‌ఔట్‌లుగా వెనుదిరిగితే ఐదో బంతికి సకీబ్‌ మహమూద్‌ (0)ను హోల్డర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈక్రమంలో టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి విండీస్‌ బౌలర్‌గా హోల్డర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.


దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే వెస్టిండీస్‌ 17పరుగులు తేడాతో మ్యాచ్‌ను గెలవడంతోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా జేసన్‌ హోల్డర్‌ నిలిచాడు. 2.5ఓవర్లలో 27పరుగులిచ్చిన హోల్డర్‌ 5వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. హోసెయిన్‌ 4వికెట్లు, స్మిత్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత ఇంతకుముందు శ్రీలంక మాజీ కెప్టెన్‌ లసిత్‌ మలింగ, ఐర్లాండ్‌ పేసర్‌ కర్టిస్‌ కాంఫర్‌, అఎn్గాన్‌ స్పిన్నర్‌ రషీధ్‌ఖాన్‌ సాధించగా వీరి సరసన హోల్డర్‌ చేరాడు.

స్కోరు బోర్డు : వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌..

బ్రాండన్‌ కింగ్‌ (సి) క్రిస్‌జోర్డాన్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 31, మేయర్స్‌ (సి) సాల్ట్‌ (బి) అదిల్‌ రషీద్‌ 31, షెఫర్డ్‌ (సి) సకీబ్‌ మహమూద్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 6, పూరన్‌ (బి) అదిల్‌రషీద్‌ 21, పొలార్డ్‌ (నాటౌట్‌) 41, పావెల్‌ (నాటౌట్‌) 35. ఎక్స్‌ట్రాలు 11. మొత్తం: 179 (4వికెట్లు. 20ఓవర్లు). వికెట్లపతనం: 59-1, 67-2, 89-3, 105-4. బౌలింగ్‌: టాప్లే 4-0-43-0, సకీబ్‌ మహమూద్‌ 2-0-27-0, మొయిన్‌ 3-0-20-0, జోర్డాన్‌ 4-0-52-0, అదిల్‌రషీద్‌ 4-0-17-2, లివింగ్‌స్టోన్‌ 3-0-17-2.

- Advertisement -

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌..

జాసన్‌ రాయ్‌ (సి) పూరన్‌ (బి) హోసెయిన్‌ 8, టామ్‌ బాంటన్‌ (సి) హోల్డర్‌ (బి) ఓడియన్‌ స్మిత్‌ 16, జేమ్స్‌ విన్స్‌ (సి) ఫాబియన్‌ (బి) హోసెయిన్‌ 55, మొయిన్‌అలీ (సి) మేయర్స్‌ (బి)హోల్డర్‌ 14, లివింగ్‌స్టోన్‌ (సి) ఓడియన్‌ (బి) హోసెయిన్‌ 6, శామ్‌ బిల్లింగ్స్‌ (సి) వాల్ష్‌ (బి) హోల్డర్‌ 41, ఫిలిప్‌ సాల్ట్‌ (స్టంపౌట్‌) హోసెయిన్‌ 3, క్రిస్‌ జోర్డాన్‌ (సి) వాల్ష్‌ (బి) హోల్డర్‌ 7, అదిల్‌రషీద్‌ (సి) ఓడియన్‌ (బి) హోల్డర్‌ 0, సకీబ్‌ మహమూద్‌ (బి) హోల్డర్‌ 0, టాప్లే (నాటౌట్‌) 0. ఎక్స్‌ట్రాలు 12. మొత్తం: 162 (10వికెట్లు. 19.5ఓవర్లు). వికెట్లపతనం: 8-1, 40-2, 86-3, 95-4, 112-5, 119-6, 162-7, 162-8, 162-9, 162-10. బౌలింగ్‌: హోసెయిన్‌ 4-0-30-4, జాసన్‌ హోల్డర్‌ 2.5-0-27-5, కాట్రెల్‌ 3-0-21-0, స్మిత్‌ 4-0-41-1, పొలార్డ్‌ 2-0-15-0, షెఫర్డ్‌ 1-0-7-0, ఫాబియన్‌ అలెన్‌ 3-0-17-0.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement