ముంబై : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన కెరీర్‌పై ఓ స్పష్టత ఇచ్చాడు. టీ20 కోసం ఇంకా సహకారం అందించాలని భావిస్తున్నా అని, మరో మూడేళ్ల పాటు ఆడేందుకు నిర్ణయించుకున్నా అని ధావన్ చెప్పుకొచ్చాడు. ఢిల్లికి చెందిన 36 ఏళ్ల ధావన్.. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 421 పరుగులు చేశాడు. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. టీ20 మ్యాచుల్లో రాణించేందుకు తన అనుభవం కొంత ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. నేను ఇప్పటికీ జట్టులో సభ్యుడే అన్న ధావన్, ఇంకా టీ20 మ్యాచులు ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. టీ20 ఫార్మాట్స్‌లో బాగానే రాణిస్తున్నట్టు భావిస్తున్నా అని అన్నాడు.
ఈ ఫార్మాట్‌లో మేనేజ్‌మెంట్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తించినట్టు వెల్లడించాడు. ఏ ఫార్మాట్‌లో అయితే రాణిస్తున్నానో.. అందులో ఆడేందుకు ఇష్టపడుతున్నట్టు తెలిపాడు. ఐపీఎల్ అయినా, దేశావళీ క్రికెట్ అయినా.. ఏదైనా.. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అర్ధ శతకాలు, శతకాలు బాదితేనే స్థిరత్వం అనిపించుకోదని, చేసే స్కోర్ మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించడమే అసలైన స్థిరత్వం అని తెలిపాడు. గతేడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన సమయంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించానని, దీంతో తన కల సాకారం అయ్యిందని చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..