Tuesday, July 2, 2024

T20 WC | ఫైనల్స్‌కు ఎవరు చేరినా చరిత్రే…

టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్‌ చేరిన దక్షి ణాఫ్రికా ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్‌ జట్టు
ఎలాగైనా ఫైనల్‌ చేరాలని పట్టుదలగా ఉంది.

రషీద్‌ ఖాన్‌ బృందంతో అమీతుమీ…

ఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్‌ చేరిన రషీద్‌ ఖాన్‌ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్‌ లారా స్టేడియం ఇందుకు వేదిక.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్‌.. రీజా హెండ్రిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌తో పాటు స్పిన్‌ దళం మ్యాజిక్‌ చేసిందని కొనియాడాడు. ముఖ్యంగా హెండ్రిక్స్‌ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్‌ హాగ్‌.. ప్రొటిస్‌ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు. అలాగే అప్ఘ‌నిస్థాన్ సైతం అన్ని విధాల బ‌లంగా ఉంది… స్పీన్, పాస్ట్ బౌలింగ్ లో ఆ జ‌ట్టుదే ఒకింత పై చేయి… ఈసారి ఫైన‌ల్స్ కు చేరి చ‌రిత్ర సృష్టించాల‌ని ర‌షీద్ సేన భావిస్తున్న‌ది.. సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్‌ వాళ్లదేనంటూ బ్రాడ్‌ హాగ్‌ జోస్యం చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement