ఇంగ్లండ్‌తో మరో రెండు రోజుల్లో జరగబోయే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తరపున సారథిగా ఎవరు ఉంటారన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాగే మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నదానిపైనా ఆసక్తి రేపుతోంది. ఇంగ్లండ్-భారత జట్ల మధ్య ఎడ్గ్‌బాస్టన్‌లో రీషెడ్యూల్ చేసిన ఐదవ టెస్ట్ మ్యాచ్ జులై1వ తేదీన జరగనుంది. అయితే భారత జట్టులో కీలక ఆటగాడు రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో ఆయన ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు కె.ఎల్.రాహుల్ గాయాల కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అధికారికంగా ఇంతవరకు వైస్ కెప్టెన్ పేరును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు తరపున ఎవరు ఆటను ప్రారంభిస్తారన్నది చర్చ. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సాధారణంగా టెస్ట్ ఓపెనర్‌గా ఆడుతూంటారు. కాగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంతో ఉంది.
రెండురోజుల్లో జరిగే నాల్గవ మ్యాచ్‌లో విజయం సాధించడం లేదా డ్రా చేయడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిల్లో ఐసీసీ (ఇంటర్నేనల్ క్రికెట్ కౌన్సిల్) ప్రశ్నను క్రికెట్ క్రీడాభిమానుల ముందుంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానిపక్షంలో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారని ఐసీసీ ప్రశ్నించింది. ఆ స్థానంలో ఎవరు ఆడాలో పేరు సూచించాలంటూ కోరింది. ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్‌లో మంగళవారంనాడు ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసింది. మరోవైపు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేని నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించామని బీసీసీఐ ప్రకటించిం ది.దీనిపై పెద్దఎత్తున క్రికెట్ అభిమానులు స్పందించారు. ప్రఖ్యాత స్పిన్ బౌలర్ హర్భజన్‌కూడా స్పందిస్తూ పేసర్ జస్పీత్ బుమ్రా అయితే బాగుంటందంటూ ఆయన ఫోటోను ట్యాగ్ చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.