Friday, November 22, 2024

Cricket Rules | ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​ రూల్స్​ ఏంటి?.. వ‌ర్షం వ‌చ్చినా, పూర్తి ఓవ‌ర్లు ఆడాలంటే ఎలా?

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. అహ్మదాబాద్‌లో భారీ వర్షం కారణంగా టాస్ కూడా వాయిదా పడింది. లక్షమంది కూర్చునే కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ, వర్షం మాత్రం ఇంకా ఆగలేదు. అయితే, ఫైనల్‌ వంటి పెద్ద మ్యాచ్‌లపై వర్షం ప్రభావం పడకుండా నిర్వాహకులు నిబంధనలు రూపొందించారు.

రాత్రి 9.35 నిమిషాల కల్లా వర్షం ఆగిపోతే ఒక్క ఓవర్ కూడా తగ్గించకుండా మ్యాచ్ ఆడిస్తారు. అంటే ప్రతి టీమ్ 20-20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఇక.. ఆ తర్వాత కూడా వర్షం కురిస్తే ఓవర్లు తగ్గుతాయి. ఎన్ని ఓవర్లు తగ్గించాలో మ్యాచ్ నిర్వాహకులు, అంపైర్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఐదేసి ఓవర్లతో మ్యాచ్ కొనసాగించడానికి కటాఫ్ సమయం రాత్రి 11.56 నిమిషాలుగా నిర్ణయించారు. కానీ, అప్పటికీ వర్షం కొనసాగితే, రిజర్వ్ డే అయిన రేపు (సోమవారం) మ్యాచ్‌ను ఉంటుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement