భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్ మ్యాచ్‌లను దూరదర్శన్ ప్రసారం చేయనుంది. 2 టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన నెలరోజుల ద్వైపాక్షిక సిరీస్ జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లను ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేసేందుకు దూరదర్శన్ సిద్ధమైంది. టీ20, వన్డే సిరీస్‌లు డీడీ స్పోర్ట్ ్సలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. హిందీ, ఆంగ్లం, తమిళం, తెలుగు,బంగ్లా, కన్నడ భాషల్లో డీడీ నెట్వర్క్ ప్రాంతీయ ఛానెల్‌లు డీడీ పొధిగై, డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, డీడీ బంగ్లా, డీడీ చందనలో ప్రసారం అవుతాయి.
టెస్టు మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్‌లో ప్రసారం చేయబడతాయి. డబ్ల్యుటీసీ ఫైనల్ ఓటమి తర్వాత ప్రసార హక్కుల విషయంలో బీసీసీఐ దూరదర్శన్‌కు అవకాశం కల్పించడం ఇదేతొలిసారి. ప్రాథమిక మీడియా హక్కుల హోల్డర్‌గా ఫ్యాన్‌కోడ్ మొత్తం సిరీస్‌ను తన డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేస్తుంది