Tuesday, November 26, 2024

West Indies : విండీస్ కెప్టెన్ గా పావెల్

టి 20 ప్రపంచకప్ 2024 కోసం రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మెరుపు బ్యాటర్ రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించారు. అల్జారీ జోసెఫ్‌ జట్టు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

- Advertisement -

అలాగే ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లందరికీ ఈ జట్టులో చోటు దక్కింది. దీంతో పాటు పలువురు స్టార్ ప్లేయర్లకు కూడా జట్టులో అవకాశం దక్కింది. ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నందున విండీస్ స్వదేశంలో రికార్డు స్థాయిలో మూడో టైటిల్‌పై కన్నేసింది.

వెస్టిండీస్ జట్టు:

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హొస్సేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్.

గ్రూప్ సిలో విండీస్

2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఇరవై జట్ల మధ్య 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ జట్లన్నీ ఒక్కొక్కటి 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. వెస్టిండీస్‌ గ్రూప్‌ సిలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా , పాపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. వెస్టిండీస్ తన తొలి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ గయానాలో జరగనుంది.

4 గ్రూపులు ఇలా ఉన్నాయి
గ్రూప్ A: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా
గ్రూప్ బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement