బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలో ఓడించింది.. వెస్టిండీస్ విజయంలో హీరో ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్. బొటనవేలు గాయంతో బాధపడుతున్నప్పటికీ, జోసెఫ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. నొప్పి ఉన్నప్పటికీ జోసెఫ్ 11.5 ఓవర్లు నిరంతరాయంగా బౌలింగ్ చేసి 68 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. వీరిలో నలుగురు బ్యాట్స్‌మెన్ జోసెఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం.
216 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంబించిన ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. జోష్ హేజిల్‌వుడ్ రూపంలో ఆస్ట్రేలియా చివరి వికెట్ పడింది. జోసెఫ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగు రోజులలోనే ముగియడం విశేషం.. ఆసీస్ వెన్ను విరిచిన షమర్ జోసప్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది..
వెస్టీండీస్ తొలి ఇన్నింగ్స్ ..311 రెండో ఇన్నింగ్స్ 193
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 289/ 9 డిక్లేర్ .. రెండో ఇన్నింగ్స్ 207